బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొంది వాసంతి కృష్ణన్. షోలోకి అడుగుపెట్టే వరకు ఈమె గురించి జనాలకు పెద్దగా తెలియదు. ఒకట్రెండు చిన్న సినిమాల్లో నటించింది. అల్లరి పిల్లగా హౌస్ లోకి అడుగుపెట్టిన వాసంతి చాలా సైలెంట్ గా ఉంటుంది. ఇతర కంటెస్టెంట్స్ తో కూర్చొని కబుర్లు చెప్పడం తప్ప గేమ్ ఆడడం లేదు. దీంతో నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున కూడా ఆమెకి క్లాస్ తీసుకున్నారు. చాలా మంది హౌస్ మేట్స్ ఆమెకి వరస్ట్ కంటెస్టెంట్ గా స్టాంప్ కూడా వేశారు. అయితే హౌస్ లో గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. రెడీ అవ్వడంతో మాత్రం ఆమెని ఎవరూ బీట్ చేయలేరు.