శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన తొలి సినిమా 'దఢక్'కు ప్రేక్షకాదరణ లభించింది. దీంతో ఆమెకి సినీ అవకాశాలు వెల్లువెత్తాయి. ఆమె నటించిన పలు సినిమాలకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. లాక్ డౌన్ లో ఆమె నటించిన సినిమాలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. ఈ సినిమాలతో జాన్వీకి నటన పరంగా మంచి పేరొచ్చింది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫొటోషూట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన హాట్ ఫొటోలు ఓ రేంజ్ లో ఉన్నాయి. జాన్వీ అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.