'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

తన క్యూట్ లుక్స్ తో యూత్ ని ఫిదా చేసింది.

దీంతో ఈ టీనేజ్ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో ఈమె నటించిన 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

అలానే రీసెంట్ గా విడుదలైన 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం' సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది.

ఈరోజు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కృతి అందాన్ని తెగ పొగిడేస్తున్నారు.

కృతిశెట్టి లేటెస్ట్ ఫొటోలు