ప్రముఖ బాలీవుడ్ సీరియల్ నటి మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఈమె డబ్బింగ్ సీరియల్ 'నాగిని' సీరియల్ తో మంచి పాపులారిటీ దక్కించుకుంది. బాలీవుడ్ సీరియల్స్ తో పాటు సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటుంది. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ సూరజ్ నంబియార్ ను పెళ్లాడింది ఈ బ్యూటీ. పెళ్లి తరువాత ఈ బ్యూటీ ట్రిప్స్ కి బాగా వెళ్లింది. కొన్నిరోజుల పాటు వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేసింది. బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా 'బ్రహ్మాస్త్ర'లో కీలకపాత్ర పోషించింది మౌనిరాయ్. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో మళ్లీ వెకేషన్ కి చెక్కేసింది మౌనిరాయ్. మాల్దీవ్స్ కి వెళ్లి అక్కడి ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది.