నాగ శౌర్య పాదయాత్ర, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. యువ హీరో నాగ శౌర్యకు ఈ మధ్య హిట్స్ కరువయ్యాయి. ‘వరుడు కావలెను’ సినిమా బాగున్నా, హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. తాజాగా నాగశౌర్య తిరుపతిలో పాదయాత్ర మొదలుపెట్టాడు. వర్షంలో తడుస్తూ.. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ బిజీగా కనిపించాడు. ఇంతకీ నాగ శౌర్య పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడనేగా మీ డౌట్? ఇదంతా అతడు నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ కోసం. సెప్టెంబర్ 23న ఈ మూవీ థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. ప్రమోషన్స్ కోసం నాగ శౌర్య తెలుగు రాష్ట్రాలు చుట్టేయాలని ప్లాన్ చేశాడు. నెల్లూరులో మొదలెట్టిన ఈ పాదయాత్ర వైజాగ్‌లో ముగియనుంది. ఈ చిత్రాన్ని యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ, సింగర్ షిర్లీ సెటియా టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఉషా మల్పూరి నిర్మించిన ఈ చిత్రానికి అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించారు.