అనసూయ, మరీ ఇలా తింటావా? ఆమె డిన్నర్ చూస్తే మీరూ అదే అంటారు! తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా దూసుకెళ్తోంది అనసూయ. అనసూయకు ఉన్న ఆ క్రేజే టాలీవుడ్‌లో అవకాశాలను తెచ్చిపెట్టింది. అయితే, అనసూయ ఫిట్‌నెస్ మీద కేర్ తీసుకోదని చాలామంది అనుకుంటారు. కానీ, అది అసత్యం. అనసూయ ఫిట్‌నెస్ కోసం ఆహార నియమాలు పాటిస్తుంది. వ్యాయామాలు పెద్దగా చేయకపోయిన డైట్ ద్వారా ఫిట్‌గా ఉండేదుకు ప్రయత్నిస్తుంది. తాజాగా అనసూయ తన డిన్నర్ డైట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బ్రకోలీతోపాటు ఒక గుడ్డును ముక్కలుగా చేసుకుని ఆమె ఆరగిస్తున్నారు. దీంతో ఆమె అభిమానులు ‘‘అనసూయ మరీ ఇలా తింటావా’’ అని ఫీలవ్వుతున్నారు. అంతే మరి, రంగుల ప్రపంచంలో రాణించాలంటే అందం, ఆరోగ్యం చాలా ముఖ్యం. అనసూయ తింటున్న డైట్‌ను మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా బరువు తగ్గుతారు. Images and Videos Credit: Anasuya Bhardwaj/Instagram