అషూ రెడ్డి చాలా రిచ్ గురూ, ఏకంగా బెంజ్ కారు గిఫ్ట్ అషూ రెడ్డిని అంతా జూనియర్ సమంత అంటారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కేరీర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు సెలబ్రిటీగా మారింది. ‘బిగ్ బాస్’ సీజన్-3తో అషూరెడ్డికి మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత ‘బిగ్ బాస్ - నాన్ స్టాప్’లోనూ లక్ పరీక్షించుకుంది. ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూతో అషూరెడ్డి అందరినీ ఆశ్చర్యపరిచింది. అషూరెడ్డి, అమెరికా సిటిజన్. టెక్సాస్‌లో ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండేది. రెండు, మూడు సినిమాల్లో కూడా అషూరెడ్డి చిన్న పాత్రలు చేసింది. అషూరెడ్డి మొదటి నుంచి రిచ్ కిడ్డే. ఆమె తండ్రి యూఎస్‌లో బిజినెస్‌మ్యాన్. అషూరెడ్డి బర్త్ డే సందర్భంగా ఆమె తండ్రి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. ‘మెర్సిడెస్ జిఎల్‌సి 300డి’ కారును ఆయన అషూకి కానుకగా ఇచ్చారు. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.75 లక్షలు, ఆన్ రోడ్ రూ.కోటి ఉండొచ్చు. ఇది కాకుండా అషూ వద్ద ఇప్పటికే ముస్తాంగ్, మెర్సిడెస్ కార్లు ఉన్నాయి. Images and Videos Credit: Ashu Reddy/Instagram