ఈ వారం కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం! యువ హీరో నాగశౌర్య నటించిన చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' సెప్టెంబర్ 23న రిలీజ్ కానుంది. శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా 'అల్లూరి' ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీసింహ నటించిన 'దొంగలున్నారు జాగ్రత్త' సెప్టెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'మాతృదేవోభ' అనే సినిమా సెప్టెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'పగ పగ పగ' అనే సినిమా సెప్టెంబర్ 22న రిలీజ్ కానుంది. తమన్నా 'బబ్లీ బౌన్సర్' సెప్టెంబర్ 23న నేరుగా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సినిమా సెప్టెంబర్ 23 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. 'డ్యూడ్' అనే హిందీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'హుష్ హుష్' అనే మరో హిందీ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో 'జాంతారా' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.