అనుపమా హిందీ పాట, ఫరియాకు గూజ్ పింపుల్స్ - ఫన్నీ పోస్ట్ వైరల్! ‘కార్తీకేయ-2’ హిట్‌తో అనుపమా ఆనందానికి అవధుల్లేవు. ఇప్పుడు అనుపమా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. అందుకే కాబోలు.. ఇప్పుడు హిందీ పాట అందుకుంది. ఔనండి, అనుపమా తాజాగా హిందీ పాట పాడింది. హీరోయిన్ వాలీ ఫీలింగ్, నా బ్యాడ్ హిందీకి క్షమించండని ఈ వీడియో పోస్ట్ చేసింది. ఆమె పాటకు ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా కూడా స్పందించింది. ఫన్నీగా.. ‘గూజ్‌పింపుల్స్ బ్రో’’ అని రిప్లై ఇచ్చింది. ఆ కామెంట్‌కు అనుపమా.. పకపకా నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చింది. దీంతో వారి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. Images & Videos: Anupama Parameswaran/Instagram