కాజల్ గుర్రపు స్వారి, యువరాణిని తలపిస్తున్న బ్యూటీ! నటి కాజల్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ఫ్యామిలీతో గడుపుతోంది. కాజల్ కొద్ది నెలల కిందట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ ఫిట్‌నెస్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రెగ్నన్సీ వల్ల కాజల్ బాగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, కాజల్ త్వరలోనే ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. పలువురు దక్షిణాది వెబ్‌సీరిస్ నిర్మాతలు కాజల్ కోసం వెయిట్ చేస్తున్నారట. ప్రస్తుతం కాజల్ హార్స్ రైడింగ్ శిక్షణ పొందుతోంది. తాజాగా కాజల్ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. గుర్రంపై ఎంతో ఠీవిగా యువరాణిలా కనిపిస్తున్న కాజల్‌ను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. Images & Videos Credit: Kajal Aggarwal/Instagram