ఈ ఫొటోలో ఉన్నది ఎవరో తెలుసా? నేషనల్ క్రష్! అవును... హీరోయిన్ రష్మిక! సాధారణంగా హీరోయిన్లు బయటకు వస్తే స్టైలిష్‌గా రెడీ అవుతారు. ఈ మధ్య ఎయిర్ పోర్టుల్లో కూడా ఫోటోలు తీస్తున్నారుగా! రష్మికా మందన్నా మాత్రం చాలా సింపుల్‌గా బయటకు వచ్చేశారు. ట్రాక్ ప్యాంటు, టీ షర్టు ధరించి... పైన ఓ క్యాప్ పెట్టుకుని రష్మిక ఎయిర్ పోర్టులో వచ్చారు. నేషనల్ క్రష్ కనిపిస్తే జనాలు వదిలి పెడతారా? సెల్ఫీలు అంటూ ఆమెను చుట్టుముట్టేశారు. డిసెంబర్ 1న 'యానిమల్' సినిమాతో రష్మిక థియేటర్లలోకి రానున్నారు. 'యానిమల్' సినిమాలో రణబీర్ కపూర్ సరసన రష్మిక నటించారు. వాళ్ళ లిప్ లాక్ వైరల్ అయ్యింది. 'యానిమల్' కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప 2'లో కూడా రష్మిక నటిస్తున్నారు. 'రెయిన్ బో', 'గాళ్ ఫ్రెండ్' సినిమాల్లో కూడా రష్మిక నటిస్తున్నారు. రష్మిక (all images courtesy : manav manglani)