‘జబర్దస్త్’కు యాంకర్ అనసూయ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అనసూయ స్థానంలో కొత్త యాంకర్ వస్తుందంటూ వార్తలు వచ్చాయి. కొందరు స్రవంతి చొక్కారపు ‘జబర్దస్త్’కు యాంకర్‌గా వస్తుందన్నారు. ఆ తర్వాత యాంకర్ మంజుషా ఆ బాధ్యతలు తీసుకుందున్నారు. కానీ, గురువారం ప్రసారమైన ‘జబర్దస్త్’లో రష్మీ ఎంట్రీ ఇచ్చింది. ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లకు తానే యాంకర్‌గా ఉంటానని రష్మీ చెప్పింది. ఇకపై తాను ‘‘ఆడా ఉంటా, ఈడా ఉంటా’’ అని రష్మీ వెల్లడించింది. దీంతో కొత్త యాంకర్ ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారికి రష్మీ షాకిచ్చింది. అయితే, అనసూయ అభిమానులకు మాత్రం ఇది బ్యాడ్ న్యూసే. మరి భవిష్యత్తులో అనసూయ తిరిగి ‘జబర్దస్త్’కు వస్తుందో లేదో చూడాలి. Images Credit: Anasuya, Sravanthi, Manjusha, Rashmi/Instagram Video Credit: Rashmi Goutam