రసం పొడి రెసిపీ ఇలా ఇంట్లోనే...

చారు లేదా రసం రోజూ వండుకునే వాళ్లకి ఈ రసం రెసిపీ ఉపయోగపడుతుంది.

ధనియాలు - ఒక కప్పు
జీలకర్ర - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - పది
కరివేపాకులు - గుప్పెడు
మిరియాలు - ఒక స్పూను
ఎండుమిరపకాయలు - ఎనిమిది
మినపప్పు - ఒక స్పూను
ఇంగువ - పావు స్పూను

కళాయిలో నూనె ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు, మినపప్పు వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

కళాయిలో కాస్త నూనె వేసి ఎండు మిరపకాయలు వేయించాలి.

ఇప్పుడు మిక్సీ జార్లో అన్నింటినీ వేయాలి. చివర్లో ఇంగువ పొడి కూడా కలపాలి.

అన్నీ కలిపి మిక్సీలో పొడిగా చేస్తే చారు పొడి రెడీ అయినట్టే.

మిక్సీ జార్ మూత తీయగానే పొడి ఘుమఘుమ లాడిపోతుంది.

ఈ పొడితో చారు చేశాక పైన కొత్తిమీర చల్లితే ఆరోజు చారు అదిరికపోవడం ఖాయం.