Horoscope Today 22 July 2022 జులై 22 శుక్రవారం రాశిఫలాలు
మేషం ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. ఉన్నత విద్యకు ఇదే సరైన సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.
వృషభం జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఓ క్షణం కోపం మరో క్షణం ఆనందం అన్నట్టుంటుంది. స్నేహితులను కలుస్తారు. కళలు, సంగీతంపై ఆసక్తి పెరుగుతుంది. ఫుడ్ పై చాలా ఆసక్తి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
మిథునం ఓపికగా ఉండాలి. అనవసర కోపం, వాదన వల్ల మీకే ఇబ్బంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. స్నేహితుల సహకారంతో ఆదాయం పెరుగుతుంది. సోదరులతో విభేదాలు ఉండొచ్చు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడతాయి. మాట్లాడేటప్పుడు ఆలోచించండి.
కర్కాటకం తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. మనశ్శాంతి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మితంగా మాట్లాడండి. మారటతీరులో కర్కశత్వం తగ్గేలా చూసుకోండి. వ్యాపారులు ఇబ్బంది పడతారు.
సింహం ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.సహనం తగ్గిపోతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సోదరులు, సోదరీమణుల మద్దతు మీకు ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
కన్య ఓపికగా ఉండండి. అనవసరమైన కోపం, వాదనకు దూరంగా ఉండండి. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. విద్యాపరమైన లేదా మేధోపరమైన పనిలో నిమగ్నత పెరుగుతుంది. నమ్మకంగా వ్యవహరించండి. మితిమీరిన ఉత్సాహం తగ్గించుకోండి. వ్యాపారం ఊపందుకుంటుంది.
తులా రోజంతా ఆనందంగా ఉంటారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారం పెరుగుతుంది. స్నేహితుల సహకారం ఉంటుంది. కోపం తగ్గించుకోండి. ఉద్యోగులు, విద్యార్థులకు మంచి రోజు. కీర్తి పెరుగుతుంది. బహుమతులు అందుకుంటారు.
వృశ్చికం ఆత్మ విశ్వాసం పెరుగుతుంది కానీ మనస్సు చంచలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ఖర్చులు పెరుగుతాయి. . సహనం తగ్గుతుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. చదువుపై ఆసక్తి పెరుగుతుంది.
ధనుస్సు మానసిక ప్రశాంతత ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న విద్యార్థులకు శుభసమయం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదో విషయంలో అసహనంగా ఫీలవుతారు. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. మీకు గౌరవం లభిస్తుంది.
మకరం ఓపికగా వ్యవహరించండి. మీ భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి. మతపరమైన పనులను ఆసక్తిగా చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు పెరుగుతాయి. మనస్సులో కొంత ప్రతికూలత ఉండవచ్చు. ఆదాయం తగ్గుతుంది.. ఖర్చులు అదుపుచేయండి.
కుంభం ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. పనిభారం పెరుగుతుంది. మీ కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశంలో ఉండవలసి రావచ్చు. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణ ఖర్చులు పెరగుతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. తలపెట్టిన పనుల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.
మీనం కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. అనవసరమైన కోపం మానుకోండి.మాట్లాడేటప్పుడు ఓపికగా వ్యవహరించండి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మేధోపరమైన పనిలో విజయం సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.