సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన అంటే కుర్రకారుకు భలే ఇష్టం. ‘యూట్యూబ్’లో ఆమె సాంగ్స్, కవర్ సాంగ్స్ చాలా బాగుంటాయి. దీప్తి అప్పుడప్పు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపించేది. ‘బిగ్ బాస్’లోకి వెళ్లి వచ్చిన తర్వాత సినిమాలు తగ్గించేసింది. ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ మరింత ఆకట్టుకుంటోంది. ప్రియుడు షన్ముఖ్‌తో బ్రేకప్ వల్ల గుండె భారంగా ఉన్నా చిరునవ్వుతో కవర్ చేస్తోంది. ఫ్రెండ్స్‌తో టైంపాస్ చేస్తూ షన్నును మరిచిపోయే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఫిట్‌నెస్ జిమ్‌లో పాట్లు పడుతోంది. తాజాగా దీప్తి ఓ వీడియోను పోస్ట్ చేసింది. చల్లని గాలిని ఆస్వాదిస్తూ.. ఆ వెంటనే కంగారుగా నడించింది. ఈ వీడియో చూసి ఎందుకంత కంగారు దీప్తి అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. Images & Videos: Deepthi Sunaina/Instagram