గోదావరి జిల్లాల్లో పులస చేపంటే చాలా ప్రత్యేకత



సీజన్ వచ్చిందంటే చాలు ఎంత ఖరీదైనా పులస తినాల్సిందే అంటారు అక్కడి జనం



ఈ మధ్య అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు, యానాంలో భారీ ధర పలికాయి పులస చేపలు



రాజోలు డైలీ మార్కెట్లో 3 కేజీల పులస చేప రూ.22,000 ధర పలికింది



యానాం మార్కెట్లో రెండు కిలోల బరువున్న పులస రూ.19 వేల ధర పలికింది



అదే కోవలోకి వచ్చే మరో చేప కచడి.



సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్లో 18 కేజీల కచడి చిక్కింది.



దీనిని ఒక వ్యక్తి 59 వేల రూపాయలను వెచ్చించి కనుగోలు చేశారు.



ఈ చేప పొట్టభాగంలో ఔష‌ధ‌గుణాలు ఉంటాయని ఇక్కడి వారు చెబుతున్నారు.



ఉప్పాడ కు చెందిన మత్స్యకారుడు వలకు మరో కచిడి చేప చిక్కింది.



దీనిని 2లక్షల 90వేలకు చేజిక్కించుకున్నాడో వ్యక్తి.



కచిడి చేపలో ఆడ చేప కంటే మగ చేపలో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయట.