పుస్తెలు అమ్మయినా సరే పులస తినాలి అని వింటుంటాం.

గోదావరి జిల్లాల్లో వరదల సమయంలో అప్పుడప్పుడు దొరికే పులస గిరాకీనే వేరు.

వలకు చిక్కిన కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో పులస చనిపోతుంది.

ఓ మత్స్యకారుడికి దొరికిన పులస మాత్రం చాలాసేపటి వరకు ప్రాణాలతో ఉంది.

దాంతో పులసను పట్టుకున్న మత్స్యకారుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

బతికున్న పులసను ఏకంగా 17 వేల రూపాయలు పెట్టి కొన్నాడు ఒక పులస ప్రియుడు

బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేదారిలంక‌ గోదావరిలో లైవ్ పులస దొరికింది

జాలరి చందాడి సత్యనారాయణ వలలో పడ్డ పులస లైవ్ గా దొరికింది.

మామిడికుదురు మండలం పెదపట్నంలంకకు చెందిన రాంప్రసాద్ కొన్నారు

పులస ప్రియుడు ఏకంగా రూ.17000 వేలు చెల్లించి కొనుగోలు చేశాడు.