గోదారోళ్లకు పులస తర్వాత అత్యంత ప్రీతిపాత్రమైనది చీరమేను. ఈ చేప రుచే వేరు.

చిన్న సైజులో ఉండే చీర మేను చేప పేరు చెబితే లొట్టలేసుకుని తింటారంటే నమ్మశక్యం కాదు.

చీర మేనును మత్స్యకార మహిళ రూ.30 వేలకు వేలంపాటలో దక్కించున్నారు

బకెట్లో ఉన్న 15 కేజీల చీర మేను శనివారం ధర రూ.34వేలు పలికింది.

చీర మీనును ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సమృద్ధిగా ఉన్న లిజార్డ్ ఫిష్ జాతికి చెందినదిగా చెబుతారు

చీరలతో పట్టడం వల్లే దీనికి చీరమేను అనే పేరు వచ్చింది. యానాం, భైరవపాలెంలలో ఎక్కువగా లభిస్తుంది

చీరమేనును మాములు చేపల కూరలా కాకుండా ప్రత్యేకమైన పద్ధతిలో పండుతుంటారు.

వీటితో చాలామంది చింతకాయ, చింతకూర వేసుకుని ఇగురు పెట్టుకుంటారు.

గోదావరి, ఉప్పునీరు కలిసే ప్రదేశాల్లో వాటికి ఆక్సిజన్ ఎక్కువగా ఉండే నీళ్లలో చీర మేను లభిస్తుంది.

15 కేజీల చీర మేను శనివారం ధర రూ.34వేలకు పలికడం విశేషం