పుస్తెలమ్మైనా పులస చేప తినాల్సిందే అని గోదావరి జిల్లాల్లో నానుడి సముద్రంలో ఉన్నప్పుడు వీటిని ఇలసగా పిలుస్తే గోదావరి నదిలోకి వచ్చాకే పులసగా పిలుస్తారు. గోదావరి జిల్లాల్లో పులస చేపకు మామూలు క్రేజ్ ఉండదు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు డైలీ మార్కెట్లో ఓ పులస భారీ ధర పలికింది రాజోలు డైలీ మార్కెట్లో 3 కేజీల పులస చేప రూ.22,000 ధర పలికింది పులస ప్రియులు ఎగబడి మరీ దీనిని కొనుగోలు చేశారు. ఈ ఏడాది గోదావరికి వరదలు రావడంతో పులస జాడ కనిపించకుండా పోయింది ఇటీవల యానాం మార్కెట్లో రెండు కిలోల బరువున్న పులస రూ.19 వేల ధర పలికింది రెండు కిలోల బరువున్న మరో పులస చేపను రూ.23 వేలకు కొనుగోలు చేశారు కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ చేప గోదావరిలో వరద నీటికి ఎదురీదుతుంది.