కొందరకి వయసుతో పనిలేదు. మానసికంగా, శారీరకంగానూ గట్టివారమేనని నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

కొబ్బరి తోటల ద్వారా వచ్చే ఆదాయంతో చాలా కుటుంబాలకు పోషణ లభిస్తోంది.

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్లంక గ్రామానికి చెందిన గిడుగు శేషగిరిరావు చాలా ఫేమస్

శేషగిరిరావు వయస్సు 70 ఏళ్లు దాటినా కుర్రాళ్లతో పోటీపడి మరీ చెట్లు అవలీలగా ఎక్కేస్తుంటారు.

ఇప్పటివరకు ప్రతిరోజూ సుమారు 80 కొబ్బరి చెట్లు అవలీలగా ఎక్కి దిగేస్తుంటారు

కేరళలో రాష్ట్ర ఉద్యాన శాఖమంత్రి చేతులమీదుగా జాతీయ అవార్డును అందుకున్నారు శేషగిరిరావు

ఇప్పటివరకు ఆయన దగ్గర సుమారు 900 మంది వరకు శిక్షణ తీసుకున్నారు

వారంతా సురక్షితమైన విధానంలో కొబ్బరి దింపు కార్మికులుగా గోదావరి జిల్లాల్లో ఉపాధిని పొందుతున్నారు

ఖాళీగా ఉన్న యువకులకు శేషగిరిరావు తానే శిక్షణ ఇచ్చి చెట్లు ఎక్కే పరికరాన్ని ఇప్పించారు

శిష్యులు శేషగిరిరావును మా కుర్రోడు అంటుంటారు. దీనికి ఆయన ముసి ముసి నవ్వులు నవ్వుతారు