పలాస మున్సిపాలిటీ పరిధిలో ఓ అరుదైన విష సర్పం హల్ చల్ చేసింది.



స్థానిక అంబుసౌలీ చెరువు గట్టుపై గౌరీబెత్తు అనే పేరుతో అరుదైన విష సర్పం కనిపించింది.



చెరువు గట్టుకి ఆనుకొని ఉన్న చేపల వలలో గౌరీ బెత్తు విషసర్పం చిక్కుకొని ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు.



వారు వెంటనే ఆటవి శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.



అటవిశాఖ సిబ్బందితో పాటు పాములు పట్టె సంస్థ వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు.



వలను కత్తెరించి ‌‌సర్పాన్ని బయటకు తీశారు.



ప్రథమ చికిత్స చేసి అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు.



కాగా ఇది చాలా అరుదైన రకం అని రాత్రి పూట చాలా చురుకుగా ఉంటుందని అటవి శాఖ సిబ్బంది తెలిపారు.