బాలీవుడ్ క్రేజీ కపుల్స్‌లో ముందుండే జోడి రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనేలది. వీరి కొత్త ఇల్లు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దాదాపు రూ.119 కోట్లతో ఈ ఇంటి నిర్మాణం జరుగుతుందని అంచనా. షారుక్ ఖాన్ ఇల్లు ‘మన్నత్’కు దగ్గర్లోనే దీని నిర్మాణం జరుగుతుందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ కూడా దీని దగ్గర్లోనే ఉండనుంది. ‘సాగర్ రేషం’ అని పిలిచే భవనంలో 16, 17, 18, 19వ అంతస్తుల్లో ఈ ఇంటి నిర్మాణం జరుగుతోంది. క్వాడ్రాఫ్లెక్స్ మోడల్లో ఈ ఇంటిని నిర్మిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్‌కు దీపిక ఇంటి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీపికా పదుకొనే హృతిక్ రోషన్ ‘ఫైటర్’, ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ సినిమాలతో బిజీగా ఉంది. అటు రణ్‌వీర్ సింగ్ చేతిలో కూడా రెండు సినిమాలు ఉన్నాయి.