లైగర్ హీరోయిన్ అనన్య పాండే తన రెగ్యులర్ జిమ్ వద్ద సందడి చేసింది. ఫిట్‌నెస్ విషయంలో అనన్య చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. 2019లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో అనన్య బాలీవుడ్ అరంగేట్రం చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. కానీ అదే సంవత్సరం ‘పతీ పత్నీ అవుర్ వో’ సినిమాతో ఫస్ట్ హిట్ కొట్టేశారు. ఓటీటీల్లో విడుదల అయిన ‘గెహరాయియూ’ మంచి హిట్ అయింది. అందులో అనన్య పాండే పాత్రకు మంచి పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన ‘లైగర్’ అనన్యకు షాక్ ఇచ్చింది. ఇండియన్ సినిమాలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా లైగర్ నిలిచింది. ప్రస్తుతం ‘కో గయే హం కహాన్’, ‘డ్రీం గర్ల్ 2’ సినిమాల్లో అనన్య నటిస్తుంది.