వరుణ్ ధావన్, కృతి సనన్ నటించిన హిందీ చిత్రం 'భేడియా'. అల్లు అరవింద్ తెలుగులో 'తోడేలు'గా విడుదల చేశారు.

కథ : అరుణాచల్ ప్రదేశ్‌లో అడవిలో రోడ్డు వేసే కాంట్రాక్ట్ రావడంతో భాస్కర్ (వరుణ్ ధావన్) అక్కడికి వెళతాడు.

రోడ్డు వేయడానికి గిరిజన గ్రామస్థులు అంగీకరించరు. పైగా, అడవిలో యాపుమ్ వైరస్ దాడి చేస్తుందని చెబుతారు.

ఏవీ పట్టించుకోకుండా రోడ్డు పనుల్లో ఉన్న భాస్కర్‌ను తోడేలు కరుస్తుంది. దాంతో అతడిలో తోడేలు లక్షణాలు కనిపిస్తాయి.

తోడేలుగా మారిన భాస్కర్ మనుషులపై ఎందుకు చేస్తాడు? అతడికి వెటర్నరీ డాక్టర్ అనిక (కృతి సనన్) ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు?

ఎలా ఉంది? : 'తోడేలు' కాన్సెప్ట్ కొత్తది. స్టార్టింగ్ సీన్స్ క్రేజీగా ఉన్నాయి. మూవీ ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయ్యింది.

హీరోను తోడేలు కరిచిన తర్వాత సీన్స్ నవ్విస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ షాక్ ఇస్తుంది. మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యాక... కథలో వేగం తగ్గింది. లెంగ్త్ ఎక్కువైంది.

వరుణ్ ధావన్ రిస్కీ రోల్ చేశారు. కామెడీ టైమింగ్ బావుంది. అభిషేక్ బెనర్జీ, పాలిన్ కబాక్ కూడా బాగా చేశారు.

కృతి సనన్ లుక్ అడ్జస్ట్ కావడం కష్టమే. ఎండ్ టైటిల్స్ సాంగులో మాత్రమే గ్లామర్ షో చేశారు.

'తోడేలు'లో కామెడీ, థ్రిల్స్‌పై పెట్టిన కాన్సంట్రేషన్, ఎమోషన్స్‌పై పెట్టలేదు. అది మైనస్. కామెడీ బావుండటం ప్లస్.

పార్టులు పార్టులుగా చూస్తే... 'తోడేలు' బావుంటుంది. పూర్తి సంతృప్తి ఇవ్వడంలో సినిమా ఫెయిల్ అయ్యింది.