ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా తెలుగు మాస్టారు శ్రీపాద శ్రీనివాస్ (నరేష్) మారేడుమిల్లి కొండ ప్రాంతాలకు వెళతాడు. తమ కష్టాలను పట్టించుకోని నాయకులు, ప్రభుత్వాలపై కోపంతో ప్రజలు ఓటు వేయనంటే... వేసేలా చేస్తాడు హీరో. బ్యాలెట్ బాక్సులు తీసుకువెళ్ళే హీరోను ఎందుకు కిడ్నాప్ చేశారు? తర్వాత ఏమైంది? అనేది మిగతా సినిమా. ఎలా ఉంది? : సినిమాలో ఎక్కడా సహజత్వం లేదు. సినిమాటిక్‌గా ఉంటుంది. ఫోర్డ్స్ ఎమోషన్స్‌తో కనెక్ట్ కావడం కష్టం. కాన్సెప్ట్ ఒకే గానీ... కథలో సన్నివేశాలు అన్నీ రొటీన్. స్టార్టింగులో ఎండింగ్ ఊహించవచ్చు. నరేష్ తన క్యారెక్టర్‌కు న్యాయం చేశారు. 'వెన్నెల' కిశోర్, ప్రవీణ్ మధ్యలో కాసేపు నవ్వించారు. శ్రీతేజ బాగా చేశారు. నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అబ్బూరి రవి అర్థవంతమైన సంభాషణలు రాశారు. సంగీతం ఓకే. నరేష్ చేసిన మరో ప్రయోగంగా ఈ సినిమా మిగులుతుంది. కొన్ని నవ్వులు, కొన్ని డైలాగుల కోసం సినిమా చూసే ఓపిక ఉంటే ఓకే.