కోలీవుడ్ లవ్ బర్డ్స్ మంజిమా మోహన్-గౌతమ్ కార్తీక్ పెళ్లికి రెడీ అయ్యారు. నవంబర్ 28న చెన్నైలో వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. తాజాగా వీరిద్దరు కలిసి ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఈ ఫోటోలను చూసి జంట చాలా బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2019లో మంజిమా, గౌతమ్ కలిసి ‘దేవరట్టం‘ అనే సినిమా చేశారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇటీవలే ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పారు. త్వరలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించారు. Photos Credit: Manjima Mohan/Instagram