బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసిన ‘కాంతార’ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.

సినిమా లవర్స్ అస్సలు మిస్ అవ్వకూడని మాస్టర్ పీస్ ‘కాంతార’.

కంబాళ, భూత్ కోల తెగల నేపథ్యంలో జరిగే కథ ఇది.

రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అత్యంత ప్రసిద్ధి పొందిన కన్నడ సినిమాల్లో ఒకటి.

ఊహించని విధంగా మొదలై, ఊహించని విధంగా ముగిసే ఈ సినిమా స్ట్రయిట్ నెరేషన్‌తో సాగుతుంది.

ఆ తెగల ఆచారాల గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి తీసిన సినిమా కాంతార.

కర్ణాటక పురాణాల్లోని అంశాలను చాలా డిటైల్డ్‌గా తెరకెక్కించారు.

దక్షిణ కర్ణాటకలోని వర్గ రాజకీయాలను కూడా కాంతారలో టచ్ చేశారు.

అద్బుతమైన సినిమాటోగ్రఫీ, సంగీతాలను ఈ సినిమాలో ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు.

ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ అయితే అద్భుతం.