రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కస్’ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.



ఇందులో రణ్‌వీర్ సింగ్ హీరోగా కనిపించనున్నాడు. మొదటిసారి అతను డబుల్ రోల్ చేయడం విశేషం.

‘కరెంట్ లగా రే’ అనే స్పెషల్ సాంగ్‌లో దీపికా పదుకొనే కూడా కనిపించనుంది.

సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు వీరిద్దరూ జంటగా విచ్చేశారు.

రణ్‌వీర్ సింగ్, రోహిత్ శెట్టి ఇద్దరూ బ్లాక్ డ్రెస్‌లో ఈ ఈవెంట్‌కు వచ్చారు.

దీపికా పదుకొనే మాత్రం పింక్ పాంట్ సూట్‌లో దర్శనం ఇచ్చింది.

రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే కలిసి తెరపై కనిపించనున్నారు.

జాక్వెలైన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే, వరుణ్ శర్మ కూడా ఈ సినిమాలో ఉన్నారు.

‘కరెంట్ లగా రే’ అనే స్పెషల్ సాంగ్‌లో తన హుక్ స్టెప్‌కు కూడా దీపిక నర్తించింది.