క్యాన్సర్ ను జయించిన హంస నందిని- మళ్లీ షూటింగ్స్ లో బిజీ బిజీ! ‘లౌక్యం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది హంస నందిని. ‘ఈగ‘ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కల్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ఏడాదిన్నర క్రితం తనకు రొమ్ము క్యాన్సర్ సోకినట్లు హంస వెల్లడించింది. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకుంది. క్యాన్సర్ ను జయించి మళ్లీ షూటింగ్స్ లో బిజీ అయ్యింది. క్యాన్సర్ తర్వాత పాల్గొన్న తొలి షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. లొకేషన్ లో ఉల్లాసంగా కనిపించిన హంస.. మళ్లీ ప్రేక్షకులను అలరించబోతోంది. Photos & Video Credit: Hamsa Nandini/Instagram