బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా 49 సంవత్సరాల వయసులో కూడా హాట్ ఫొటోలతో చెలరేగిపోతుంది. యంగ్ బాలీవుడ్ హీరోయిన్లకు పోటీనిచ్చే ఫిట్‌నెస్‌ను మలైకా మెయింటెయిన్ చేస్తుంది. ఇటీవలే ‘ఆన్ యాక్షన్ హీరో’ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ‘మూవింగ్ ఇన్ విత్ మలైకా’ అనే షో చేస్తుంది. కేవలం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మలైకా రాణించడం విశేషం. ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో మలైకా రిలేషన్ షిప్‌లో ఉంది. తెలుగులో అతిథి, గబ్బర్ సింగ్ సినిమాల్లో మలైకా స్పెషల్ సాంగ్‌ల్లో కనిపించింది. దబాంగ్, దబాంగ్ 2 సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా మలైకా వ్యవహరించింది.