బెంగాల్, సౌరాష్ట్ర జట్ల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ ప్రారంభం అయింది.



ఈ మ్యాచ్‌లో మొదటి రోజే ఒక రికార్డు నమోదైంది.

సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ ఈ రికార్డును సాధించారు.

సౌరాష్ట్ర తరఫున 300 వికెట్లు తీసుకున్న మొదటి ఆటగాడిగా ఉనద్కత్ నిలిచాడు.

నిజానికి జయ్‌దేవ్ ఉనద్కత్ ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికయ్యాడు.

కానీ ఈ ఫైనల్ కోసం జట్టు నుంచి బయటకు వచ్చేశాడు.

ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 174 పరుగులకే ఆలౌట్ అయింది.

జయ్‌దేవ్ ఉనద్కత్ మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు దక్కించుకున్నాడు.

రోజు ముగిసేసరికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.