రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ డిసెంబర్ 1వ తేదీన విడుదల కానుంది.

అంటే ఇంకా ఐదు రోజుల్లోనే మన ముందుకు రానుందన్న మాట.

ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదల అయింది.

ట్రైలర్ అంచనాలను 100 రెట్లు భారీగా పెంచేసింది.

ఇప్పటికే ‘యానిమల్’ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.

ప్రస్తుతానికి కొన్ని స్క్రీన్లలో మాత్రమే ఓపెన్ చేశారు.

కానీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

ట్రైలర్ రాకముందు మొదటి రోజు రూ.35 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేశారు.

కానీ ట్రైలర్ విడుదల అయి, బుకింగ్స్ ఓపెన్ అయ్యాక ఏకంగా రూ.50 కోట్లు దాటేస్తుందని అనుకుంటున్నారు.