‘యానిమల్’ టికెట్లకు నార్త్ ఇండియాలో భారీ డిమాండ్ నెలకొంది. ఢిల్లీ ప్రాంతంలో ఏకంగా రూ.2200 వరకు ‘యానిమల్’ టికెట్ రేట్లు పలుకుతున్నాయి. దీన్ని బట్టి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘యానిమల్’ ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం హిందీ వెర్షన్‌కు ఇప్పటి వరకు 60 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తెలుగు వెర్షన్ కూడా 10 మిలియన్ వ్యూస్ సంపాదించింది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ సంపాదించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.