అంతర్జాతీయ వేదికపై ఆర్ఆర్ఆర్ అవార్డుల వేట ఇంకా కొనసాగుతోంది. గోల్డెన్ గ్లోబ్స్‌లో ‘నాటు నాటు’కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇదే కేటగిరిలో ఆస్కార్ నామినేషన్ కూడా దక్కించుకుంది. ఇప్పుడు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో కూడా మూడు నామినేషన్లు దక్కించుకుంది. బెస్ట్ యాక్షన్ మూవీ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ పోటీ పడుతుంది. ఇక బెస్ట్ యాక్టర్ కేటగిరీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ నామినేషన్ దక్కడం విశేషం. ఈ తెలుగు స్టార్స్ అవార్డు కోసం బ్రాడ్ పిట్, నికోలస్ కేజ్, టామ్ క్రూజ్‌లతో పోటీ పడనున్నారు. ఇక ఆర్ఆర్ఆర్‌కు బెస్ట్ పిక్చర్ విభాగంలో మరో నాలుగు సినిమాలు పోటీ ఉన్నాయి. బుల్లెట్ ట్రైన్, టాప్ గన్: మావెరిక్, వుమెన్ కింగ్ సినిమాలు కూడా ఈ కేటగిరీలో నామినేషన్ దక్కించుకున్నాయి. నికోలస్ కేజ్ ‘ది అన్ బేరబుల్ వెయిట్ ఆఫ్ మాసివ్ టాలెంట్’ కూడా ఈ అవార్డు కోసం పోటీ పడుతోంది.