రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె రెడ్ డ్రెస్సులో మెరిసిపోతూ కనిపించారు. 2023లో రకుల్ ప్రీత్ మూడు సినిమాలతో మన ముందుకు వచ్చారు. ఈ మూడు ఓటీటీలోనే విడుదల అయ్యాయి. ‘ఛత్రీవాలీ’ జీ5 ఓటీటీలో విడుదల అయింది. ‘బూ’, ‘ఐ లవ్యూ’ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్నాయి. ప్రస్తుతం తన చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి రెండూ తమిళ సినిమాలే కావడం విషయం. శివకార్తికేయన్ భారీ ప్రాజెక్టు ‘అయలాన్’లో రకుల్ ప్రీత్ సింగే హీరోయిన్. అలాగే కమల్ హాసన్ ‘ఇండియన్ 2’లో కూడా రకుల్ నటిస్తున్నారు.