రజనీకాంత్ ఇటీవలే ‘జైలర్’తో కళ్లు చెదిరే సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘తలైవర్170’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత రజనీ కాంత్... లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాకు రజనీకాంత్ ఏకంగా రూ.250 కోట్లకు పైగా పారితోషికం తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ఆసియాలోనే అత్యధిక పారితోషికం అని తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ మీడియా వర్గాలు ఈ మేరకు కథనాలను కూడా ప్రచురించాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.