బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటింది

ఏపీ, తెలంగాణ, యానాంలలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి

హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది.

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో దాని ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఉంటుంది.

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు

రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ

రాయలసీమ నుంచి కొమొరిస్ వరకు తమిళనాడు పరిసర సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది