అల్పపీడనం వాయుగుండంగా మారి, తీవ్ర వాయుగుండంగా ఉత్తర ఒడిశా వైపు కదులుతోంది.

మరికొన్ని గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వర్ష సూచన ఉన్న మరిన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు.

కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో నేడు వర్షాలు

ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే చోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు

ఈ 5 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం

ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో ఒకంట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు