పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్ గఢ్ వైపు కదులుతూ మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారుతుంది ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మూడు రోజులు భారీ వర్ష సూచన. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు బఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ జగిత్యాల, భూపాలపల్లి జిల్లాలకు భారీ వర్షాలతో రెడ్ అలర్ట్ నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో మోస్తరు వర్షాలు మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. వర్షం కురుస్తుంటే చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలకు సూచించారు