బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి నైరుతి దిశగా వంగి ఉంది.

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం కొన్ని చోట్ల రెడ్ అలర్ట్

కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయి.

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో ఆగస్టు 10 వరకు ఓ మోస్తరు వర్షాలు

రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది