భారీ వర్షాల కారణంగా ఏపీలోని 26 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్లు, 7.6 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణం వైపు కొనసాగుతోంది ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఆగస్టు 8 వరకు వర్షాలు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ ఉమ్మడి వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి వరంగల్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో భారీ వర్షాలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు ఆగస్టు 8 వరకు భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.