ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఏపీ తీరంలో సగటు సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో జూలై 30 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో భారీ వర్షాలు దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు ఉండగా, రాయలసీమకు ఎలాంటి వర్ష సూచన లేదన్న అమరావతి వాతావరణ కేంద్రం ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలలో చలి గాలులు వీస్తాయి. వర్ష సూచన లేదు భారీ వర్షాల సమయంలో వాగులు, వంకల ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించకూడదని ప్రజలను హెచ్చరించారు