నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్ ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతంలో 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొంది. గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి భారీ వర్ష సూచనతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు వర్షాలతో ఎల్లో అలర్ట్ అయింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో ఆగస్టు 10 వరకు ఓ మోస్తరు వర్షాలు ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి భారీ నుంచి అతి భారీ వర్షం నిర్మల్, కామారెడ్డి, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు మత్స్యకారులు మరో 3 రోజులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.