వాయుగుండంగా మారిన అల్పపీడనం, నేడు తీవ్ర వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది

ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.

ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేసింది వాతావరణ కేంద్రం.

ఉత్తర కోస్తాంధ్ర లోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు

శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి జల్లులు కురుస్తాయి.

ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం

వర్షం కురుస్తుండగా చెట్ల కింద నిల్చోకుండా సురక్షితమైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదు