ఈశాన్య, పరిసర ప్రాంతాలైన తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇదివరకే తీవ్రరూపం దాల్చింది.

నేటి ఉదయం ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలను బాలాసోర్, సాగర్ దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు.. ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది. ఉదయం వేళ చల్లగా ఉంటూ, మధ్యాహ్నానికి వాతావరణం పూర్తిగా వేడెక్కుతుంది


ఆగస్టు 21 వరకు రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మరో రెండు రోజులపాటు వర్షాలు

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు