ఇటీవల ఏర్పడిన అల్పపీడనం ముప్పు తొలగిపోయిందనుకుంటున్న సమయంలో వాతావరణ కేంద్రం పిడుగులాంటి ప్రకటన చేసింది ఆగస్టు 19 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడనుందని వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో రెండు రోజులు వర్షాలు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో నేడు, రేపు తేలికపాటి జల్లుల వాయుగుండం తీరాన్ని దాటడంతో బుధవారం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, మెదక్, రంగారెడ్డి ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఉదయం వేళ చల్లగా ఉంటూ, మధ్యాహ్నానికి వాతావరణం పూర్తిగా వేడెక్కుతుంది. తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు