ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో ఆగస్టు 4 వరకు భారీ వర్షాలు

తెలంగాణలో ఆగస్టు 5 వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల, 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగి బలహీనపడింది

నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, జనగామ, మహబూబ్ నగర్, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఆగస్టు 4 వరకు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు

ఉమ్మడి కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, చెట్ల కింద నిల్చోవద్దని ప్రజలకు సూచించారు

భారీ వర్షాల సమయంలో వాగులు, వంకల ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు