నేడు బంగాళాఖతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోంది.

అల్పపీడనం, అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తుకు వ్యాపించి ఉంది

వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం

మరికొన్ని గంటల్లో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు

హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో, ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజమాబాద్ జిల్లాల్లోనూ వానలు

తమిళనాడు వైపు నుంచి వస్తున్న అల్పపీడనం ప్రభావం ఉత్తర కోస్తాలో మొదలైంది.

విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు

ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు

నెల్లూరు జిల్లాలోని కొస్తా భాగాలు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు వర్ష సూచన

తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు