నైరుతి రుతుపవనాల ప్రభావంతో సీజన్‌లో చివరిసారి వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల పై అల్పపీడనం ప్రభావం అధికంగా ఉంటుంది. రెండు ఆవర్తనాల ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీ, తెలంగాణలకు మోస్తరు వర్ష సూచన ఉంది. నేడు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు అక్టోబర్ 6 నుంచి కరీంనగర్, పెద్దపల్లి, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలలో భారీ వర్షాలు రంగారెడ్డి జిల్లాతో పాటు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరం, అల్లూరి, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి జిల్లాల్లో భారీగా వర్షాలు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం సాయంత్రం అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ దక్షిణ కోస్తాంధ్రలో దసరా వరకు సాధారణ వర్షపాతం నమోదు కానుంది. కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు