నైరుతి రుతుపవనాల తిరోగమనంతో సీజన్‌లో చివరిసారి వీటి ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు

కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో 2 ఉపరితల ఆవర్తనాలు ఉన్నాయి.

వీటి ప్రభావంతో నేడు, రేపు రెండు రోజులపాటు ఏపీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురవనున్నాయి.

అక్టోబర్ 3, 4 వరకు ఏపీ, తెలంగాణ, యానాంలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు

నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి జల్లులు

రంగారెడ్డి జిల్లాతో పాటు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన

వైజాగ్, పార్వతీపురం మణ్యం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడ వర్షాలుంటాయి

విజయనగరం భోగపురం - ఆనందపురం, వైజాగ్ ఉత్తర భాగాలైన భీమిళి, రిషికుండ, మధురవాడ వైపు వర్షాలు

అక్టోబర్ 3, 4 తేదీల్లో గుంటూరు, ప్రకాశం, ఎన్.టీఆర్, నెల్లూరు జిల్లాలో వర్షాలు కురవనున్నాయి

నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయి